● చేవెళ్ల మార్కెట్‌లో నిత్యం కూరగాయలు తీసుకు వచ్చే రైతులు, కొనుగోలు చేసేందుకు వచ్చే చిరువ్యాపారులు, వీళ్లను తీసుకు వచ్చేందుకు వచ్చే ఆటో డ్రైవర్లు ఉదయం 5 గంటల నుంచే తమ ప్రయాణం మొదలు పెడుతూ కనిపించారు. మార్కెట్ ఉదయం 5.30 నుంచి 8 గంటలలోపు పూర్తవుతుంది. దీంతో ముందుగా సరుకు తీసుకు రావాలని రైతులు, త్వరగా కొనాలనే చిరువ్యాపారులు చలిని లెక్క చేయకుండా ఉదయాన్ని మార్కెట్‌లో కనిపించారు.
● రైతులు చలికి స్వెట్టర్లు వేసుకుని.. దుప్పట్లు కప్పుకొని గ్రామాల నుంచి.. పొలాల నుంచి బయలుదేరారు. కూరగాయలను ద్విచక్రవాహనాలు, ఆటోల్లో తీసుకుని ఆయా మార్కెట్లకు వచ్చారు. పూల రైతులు రాత్రిళ్లు, తెల్లవారుజామునే కోసేందుకు వెళ్లి ఉదయాన్నే మార్కెట్లకు తరలించేందుకు నానా పాట్లు పడుతున్నారు.
వణికిస్తున్న చలికి జనం కాలు బయటపెట్టేందుకే జంకుతుండగా కార్మికులు, కర్షకులు, చిరు వ్యాపారులు, కూలీలు, ఇలా అనేక రంగాల్లో పనిచేసే వారు తమ నిత్య జీవన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. పొట్ట కూటికోసం కొందరు బయలుదేరితే.. వృత్తి, ఉద్యోగ బాధ్యతల నిమిత్తం మరికొందరూ చలితో సావాసం చేస్తూ ముందుకు సాగుతున్నారు. నిత్యం పనిచేసే పేపర్ బాయ్‌లు, బస్సు డ్రైవర్లు, చాయ్ హోటళ్లు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ప్రయాణం చేసే వారు, రైతులు, చిరువ్యాపారులు ఇలా ఆయా వర్గాలకు చెందిన వారు ‘చలి’ంచకుండా తమ పనుల్లో నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment