
మొదటి బహుమతి అందుకుంటున్న విద్యార్థులు
దుబ్బాక: జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్ వాలీబాల్ పోటీలకు దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన అక్షయ ఎంపికై నట్లు పాఠశాల పీఈటీ నరేశ్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కర్నాల అక్షయ అక్టోబర్ నెలలో మహబూబ్ నగర్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్ అండర్ 17 రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది. ఈ నెల 25వ తేదీ నుండి తమిళనాడు రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాద్యాయుడు శ్రీనివాస్, సిబ్బంది ఆమెను అభినందించారు.
రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌కు..
హత్నూర( సంగారెడ్డి): మండల కేంద్రమైన హత్నూర గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల నిర్వహించిన జోనల్ స్థాయి సైన్స్ ఫెయిర్‌లో రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ సుధాకర్ గురువారం తెలిపారు. ఈనెల 11 ,12 ,13 తేదీల్లో వర్ధన్నపేట గురుకుల పాఠశాలలో జరిగిన జోనల్ స్థాయి విద్యా విజ్ఞాన ప్రదర్శనలో పనికిరాని ప్లాస్టిక్ ముడి సరుకుతో పెట్రోల్ తయారీ విధానంపై సైన్స్ ఉపాధ్యాయులు సంతోష్ కుమార్ ఆధ్వ ర్యంలో విద్యార్థులు ఉజ్వల్ జయంత్, విశాల్ రాజ్ డెమో చేసినట్లు తెలిపారు. ఇందుకు మొదటి బహుమతితోపాటు రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపికై నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు..
జహీరాబాద్: గద్వాల్‌లో నేటి నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలకు మండల కేంద్రమైన మొగుడంపల్లికి చెందిన బాలుడు ఎంపికయ్యాడు. ఎస్‌జీఎఫ్ అండర్–19 స్థాయి పోటీలకు స్టాలిన్ ఎంపికై నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాడు. దీనిపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
సదాశివపేట(సంగారెడ్డి): సంగారెడ్డిలో గల మైనార్టీ గురుకుల పాఠశాలల్లో పీజీటీ, సోషల్, టీజీటీ, గణితం, డిప్యూటీ వార్డెన్ పోస్టులకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని రీజినల్ లెవెల్ కోఆర్డినేటర్ డాక్టర్ డి.నర్సింలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టీచర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీ, బీఎడ్, డిప్యూటీ వార్డెన్ పోస్టుకు డిగ్రీ, బీఎడ్ అర్హత ఉండాలని సూచించారు, దరఖాస్తులను ఈనెల 16వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు రీజినల్ లెవెల్, కో ఆర్డినేటర్, ఆఫీస్ సంగారెడ్డి కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఆఫీసులోగాని, 76739 17990 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

క్రికెట్ పోటీలకు ఎంపికై న స్టాలిన్

అక్షయ
Comments
Please login to add a commentAdd a comment