అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్
సంగారెడ్డి జోన్: పోలీసు అధికారులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ సూచించారు. జిల్లా పరేడ్‌గ్రౌండ్‌లో శనివారం ‘వార్షిక పునరుశ్చరణ మొబిలైజేషన్’శిక్షణ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. పరేడ్‌కు హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 305 మంది ఆర్ముడ్ రిజర్వ్ అధికారులు, సిబ్బందికి 15 రోజుల పాటు ప్రాథమిక శిక్షణను గుర్తు చేస్తూ, ప్రతీ రోజు ఉదయం ఫిజికల్ ట్రైనింగ్, పరేడ్, మాబ్ ఆపరేషన్, లాఠీ డ్రిల్, ఆయుధాలపై శిక్షణ, నాకాబందీలో పాటించాల్సిన మెలుకువలు, మారుతున్న సమా జానికి అనుగుణంగా విధి నిర్వహణలో ఏవిధంగా నడుచుకోవాలని, వృత్తిరీత్యా నైపుణ్యతపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment