
మౌలిక సదుపాయాలు కల్పించాలి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని మెదక్ ఎంపీ ఎం.రఘునందన్ రావు అన్నారు. శనివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పోస్టాఫీస్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశంలోని మారుమూల గ్రామాలకు సైతం మెరుగైన పోస్టల్ సేవలను అందిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఐటీ ఉద్యోగులు ఈ ప్రాంతానికి పోస్టాఫీస్ కావాలని అడిగారని, తాను గెలిచిన వెంటనే అధికారులతో మాట్లాడి తెల్లాపూర్‌కు పోస్టాఫీస్ మంజూరు చేయించానని వివరించారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు పోస్టాఫీస్‌కు భవనం కేటాయించారని చెప్పారు. రేడియల్ రోడ్డు నంబర్ 7నుంచి తెల్లాపూర్ రైల్వే స్టేషన్ పై నుంచి విద్యుత్‌నగర్ కాలనీ వరకు పెద్ద వంతెన నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సంబంధిత అధికారులతో చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, మాజీ కౌన్సిలర్ రాజు, తెల్లాపూర్ సొసైటీ చైర్మన్ బుచ్చిరెడ్డి, బీజేపీ తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షుడు రాంబాబు గౌడ్, తెల్లాపూర్ నైబర్‌హుడ్ అధ్యక్షుడు ఈశ్వరగారి రమణ పాల్గొన్నారు.
నూతన పోస్టాఫీస్‌ను ప్రారంభించిన
ఎంపీ ఎం.రఘునందన్ రావు