
ఎనిమిది మంది వేటగాళ్ల అరెస్టు
మూడు నాటు తుపాకులు స్వాధీనం
నర్సాపూర్: అడవి జంతువులను వేటాడేందుకు ప్రయత్నించిన ఎనిమిది మంది వేటగాళ్లను అటవీ శాఖ అధికారులు శనివారం అరెస్టు చేశారు. ఎఫ్‌ఆర్‌ఓ అరవింద్ కథనం ప్రకారం... అటవీ శాఖ నర్సాపూర్ రేంజ్ పరిధిలోని నత్నాయిపల్లి అడవి శివారులో వన్య ప్రాణులను వేటాడేందుకు తుపాకులతో కొంతమంది సంచరిస్తున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వారి కోసం గాలించారు. సంగారెడ్డి జిల్లా బొంతపల్లికి చెందిన యాసిన్, నత్నాయిపల్లికి చెందిన శ్రీకాంత్, శంకరయ్య, శ్రీకాంత్, వీరస్వామి, పోచయ్య, విజయ్, భానుప్రసాద్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. వారి వద్ద మూడు నాటు తుపాకులు, ఒక కత్తి, గన్‌పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్‌ఆర్‌ఓ అరవింద్ వెంట ఆయన వెంట సెక్షన్ ఆఫీసర్ సాయిరాం తదితరులు ఉన్నారు.
150 టన్నుల
అక్రమ ఇసుక పట్టివేత
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని తోటపల్లి శివారులో అక్రమంగా డంప్ చేసిన 150 టన్నుల ఇసుకను శనివారం సిద్దిపేట టాస్క్‌ఫోర్స్, బెజ్జంకి పోలీసులు పట్టుకొని సీజ్ చేసినట్లు సిద్దిపేట కమిషనరేట్ కార్యాలయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెజ్జంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
గంజాయి చాక్లెట్లు
విక్రయిస్తున్న వ్యక్తి రిమాండ్
పటాన్‌చెరు టౌన్: గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పటాన్‌చెరు ఎకై ్సజ్ పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. ఎకై ్సజ్ సీఐ పరమేశ్వర్ గౌడ్ కథనం ప్రకారం... మెదక్ డివిజన్ ఆబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ముత్తంగిలోని ఓ ఇంటి పై దాడులు చేశారు. బిహార్‌కు చెందిన నితీశ్ కుమార్ దగ్గర నుంచి 84 గంజాయి చాక్లెట్ల (మొత్తం 465 గ్రాములు)ను స్వాధీనం చేసుకొని పటాన్‌చెరు ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు ఎకై ్సజ్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితుడు బిహార్‌లో గంజాయి చాక్లెట్స్ కొని ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

ఎనిమిది మంది వేటగాళ్ల అరెస్టు