
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నర్సాపూర్ రూరల్: ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై లింగం కథనం ప్రకారం... తుజాల్‌పూర్ గ్రామా నికి చెందిన గాలి నర్సింహులు (44) శనివా రం కిష్టయ్యపల్లికి వెళ్తున్న క్రమంలో మధ్యాహ్నం నర్సాపూర్ అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం భార్య మంజులకు ఫోన్ ద్వారా విషయం చెప్పాడు. ఆమె బంధువుల సహాయంతో నర్సాపూర్ అటవీ ప్రాంతానికి చేరుకొని అతడిని చికిత్స కోసం హైదరాబాద్ సూరారం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.