డీఐఈఓ రవీందర్‌రెడ్డి
సిద్దిపేట ఎడ్యుకేషన్ అగ్నివీర్ నియామకాలకు జిల్లాలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్‌రెడ్డి కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ..రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఏప్రిల్ 10 వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. జనరల్, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్‌మెన్ తదితర విభాగాల్లో నియామకాలు ఉంటాయన్నారు. జనరల్ విభాగానికి 10వ తరగతి 45 శాతం మార్కులతో, టెక్నికల్‌కు ఇంటర్ ఎంపీసీ 50 శాతం మార్కులతో, క్లర్క్ విభాగానికి ఇంటర్మీడయట్ 60 శాతం మార్కులతో, ట్రేడ్‌మెన్‌కు 10వ తరగతి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య ఉండి అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని వివరించారు. నియామక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందని మొదటిది 200ల మార్కులకు కామన్ ఎంట్రెన్స్ పరీక్ష, రెండవ దశలో రన్నింగ్, శారీరక దృఢత్వ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. రూ.250 పరీక్ష రుసుఒం చెల్లించి సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, పరీక్ష జూన్ నెలలో ఉంటుందన్నారు. నియామకాలు పూర్తిగా మెరిట్‌పైనే ఆధారపడి ఉంటాయన్నారు.
ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్‌ల జోలికి వెళ్లొద్దు
సిద్దిపేట సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: ఆన్‌లైన్ బెట్టింగ్ జోలికి వెళ్లకూడదని, గేమింగ్‌కి అలవాటు పడి యువత ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సిద్దిపేట సీపీ అనురాధ తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బెట్టింగ్‌లపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌లను ప్రమోట్ చేసే వారి సమాచారం అందించాలన్నారు. మోసపూరిత ప్రకటనలు, మేసేజ్‌లకు వ్యక్తిగత, ఓటీపీ వివరాలు పంపకూడదన్నారు. ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు తెలపాలన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం గోవర్థనగిరి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సోమవారం రెవె న్యూ, పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఆర్‌ఐ యాదగిరి కథనం మేరకు.. నమ్మదగిన సమాచారం మేరకు చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన బత్తుల అంకూష్ వద్ద దాదాపు 7 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీ నం చేసుకున్నాం. గ్రామంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి ఓ ప్రైవేట్ ఇంట్లో నిల్వ ఉంచారు. రేషన్ బియ్యాన్ని పట్టుకొని సివిల్ సప్లయ్ గోదాముకు తరలించాం. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్‌భాస్కర్ తెలిపారు.
హత్య కేసులో నిందితురాలి అరెస్ట్
సంగారెడ్డి క్రైమ్ : యువకుడి హత్య కేసులో నిందితురాలైన గడ్డం మరియమ్మను పోలీసుల ఆదివారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ రమేశ్ కథనం మేరకు.. 15న మన్నే వినోద్ (21) అనే యువకుడితో డబ్బుల విషయంలో గొడవ జరుగగా ఆగ్రహించిన మరియమ్మ రాయితో కొట్టి దారుణంగా హత్య చేసింది. ఈ కేసు భాగంగా నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
ఇసుక ఫిల్టర్‌పై పోలీసుల దాడి
కృత్రిమ ఇసుక తయారీ యంత్రాలు సీజ్
నిర్వాహకుడిపై కేసు నమోదు
తూప్రాన్: మట్టితో కృత్రిమ ఇసుక తయారీ చేస్తున్న ఇసుక ఫిల్టర్‌పై పోలీసులు సోమ వారం రాత్రి దాడి చేశారు. ఎస్‌ఐ శివానందం కథనం మేరకు.. మండలంలోని గౌడిగుడెం శివారులో విష్ణువర్ధన్‌రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా తవ్వకాలు జరిపి కృత్రిమ ఇసుక తయారు చేసి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి జేసీబీ, హిటాచీ, ఇసుకతో కూడిన రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.