
ప్యారానగర్ డంప్‌యార్డు అనుమతులు రద్దు చేయాలి
ఎంపీ రఘునందన్ వినతి
నర్సాపూర్: ప్యారానగర్ డంప్‌యార్డుకు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర అటవీశాఖ డైరెక్టర్ జనరల్ సుశీల్‌కుమార్ అవస్తిని కలసి వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్‌లో నిర్మిస్తున్న డంప్‌యార్డు అనుమతులను రద్దు చేయాలని ఎంపీ కోరారు. డంప్‌యార్డ్‌కు సంబంధించిన పలు అంశాలను రఘునందన్ వివరించారు. ఎంపీ వెంట నర్సాపూర్ జేఏసీ నాయకుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్, గుమ్మడిదల మండలానికి చెందిన జేఏసీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ తదితరులున్నారు.
సంగారెడ్డి వరకు
మెట్రోను పొడిగించాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు
పటాన్‌చెరు టౌన్: మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలును పొడిగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటాన్‌చెరు పట్టణంలోని శ్రామికభవన్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో మెట్రో రైలుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డినుంచి హైదరాబాద్‌కు నిత్యం వేలాదిమంది ప్రయాణం చేస్తున్నారని ఈ ప్రాంతానికి మెట్రో తప్పనిసరిగా కేటాయించాలని కోరారు. ప్రభుత్వ హామీలు అమలుకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాజయ్య, ఏరియా కార్యదర్శి నాగేశ్వరావు, పాండు రంగారెడ్డి, శాంత కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: దళితులనే వివక్షతో గ్రామపంచాయతీ కార్మికులను ఇష్టానుసారంగా విధుల నుంచి తొలగిస్తున్నారని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కులవివక్షపోరాట సమితి (కేవీపీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేవీపీఎస్ నాయకులు సంగారెడ్డిలో జిల్లా పంచాయతీ కార్యాలయం ఏవోకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ...కొన్నేళ్ల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు పారిశుద్ధ్యం, వాటర్, ఎలక్ట్రిషన్ విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు. కంగ్టి మండలంలో కంగ్టి, దేగుల్వాడి,భీంమ్రా తదితర గ్రామాలలో కార్మికులను తొలగించి వారి కుటుంబాలను రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో తొలగించిన జీపీ కార్మికులను వెంటనే విధులకు తీసుకోవాలని లేదా వారి స్థానంలో కుటుంబ సభ్యులను నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, సహాయ కార్యదర్శి దాసు తదితరులు పాల్గొన్నారు.
అక్రమ ఇసుక తరలిస్తున్న
వాహనాలు స్వాధీనం
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి మండలంలో అక్రమంగా ఇసుక, మట్టి తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని హనుమాన్‌నగర్ గ్రామ శివారులో అక్రమంగా ఇసుక, మట్టిని రవాణా చేస్తున్నారన్న సమాచారంతో మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇసుక, మట్టి అక్రమ రవాణా చేస్తున్న ఆరు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై రవీందర్ మాట్లాడుతూ...ఇసుక, మట్టి అక్రమ రవాణా చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ప్యారానగర్ డంప్‌యార్డు అనుమతులు రద్దు చేయాలి

ప్యారానగర్ డంప్‌యార్డు అనుమతులు రద్దు చేయాలి