
నేతన్నల స్థితిగతులపై అధ్యయనం
23న హన్మంత్‌రావుపేట్‌లో పద్మశాలీ సంఘం నేతల పర్యటన
నారాయణఖేడ్: నాడు వెలుగు వెలిగి నేడు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నారాయణఖేడ్ మండలం హన్మంత్‌రావుపేట్ పద్మశాలీల జీవన స్థితిపై ‘సాక్షి’దినపత్రికలో ‘సిరుల దారం...నిరాధారం, ఆదుకున్న ఊరు ఆగమైంది’శీర్షికన ప్రచురితమైన కథనానికి పద్మశాలీ సంఘం, యువజన సంఘం సభ్యులు స్పందించారు. వారి స్థితిగతులపై అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నడుంకట్టారు. నారాయణఖేడ్‌లో పద్మశాలీ సంఘం బాధ్యులు, యువకులు మంగళవారం సమావేశమయ్యారు. గ్రామానికి ఈ నెల 23న వెళ్లి గ్రామం పరిస్థితి, నాటి వైభవం, నేటి దీన జీవనం, స్థితిగతులపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా నేత కార్మికుల జీవన ప్రమాణాలు పెరగకపోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సేకరించిన సమాచారం మేర స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని, గ్రామం పునరుజ్జీవం అయ్యేలా కృషి చేస్తామని ప్రకటించారు. గ్రామ పద్మశాలీల జీవన ప్రగతి మార్పుకు తమ వంతుగా ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా పద్మశాలీల జీవన స్థితిగతులపై ‘సాక్షి’లో వచ్చిన కథనం క్లిప్పింగ్ పద్మశాలీ రాష్ట్ర, జిల్లా స్థాయి సంఘాలు, స్థానిక వాట్సప్స్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. చాలామంది క్లిప్పింగ్‌ను వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకున్నారు.
ఎఫెక్ట్

నేతన్నల స్థితిగతులపై అధ్యయనం

నేతన్నల స్థితిగతులపై అధ్యయనం