
ఈ–పంచాయతీ చెల్లింపులు ఎలా?
రాజస్థాన్ ప్రజాప్రతినిధుల ఆరా
కొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని తొగర్‌పల్లిలో మంగళవారం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు పర్యటించారు. తొగర్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంతోపాటు ఈ పంచాయతీ ద్వారా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, చెల్లింపులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయంపై పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిధిలోని అలియాబాద్ గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామంలో పంచాయతీ, ఉపాధి హామీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్లె ప్రకృతి వనం, నర్సరీలతోపాటు యాదాద్రి మోడల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా రాజస్థాన్ ప్రజాప్రతినిధులు గ్రామాలలో నిర్వహిస్తున్న ఉపాధి హామీపనులతోపాటు పల్లె ప్రకృతి వనం నిర్వహణ బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో కూడా గ్రామాలలో ఎలాంటి పథకాలు అమలు చేయాలనే విషయంపై తెలంగాణలో పర్యటిస్తున్నట్లు వారు తెలిపారు.