
ఓటరు జాబితా సవరణ
అక్రమ ఇటుక బట్టీల ధ్వంసం
జహీరాబాద్ టౌన్: స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీలు సహకరించాలని ట్రైనీ కలెక్టర్ మనోజ్ కోరారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొరపాట్లు లేకుండా ఓటరు జాబితా ఉండాలన్నారు. బీఎల్‌ఓలు 18 సంవత్సరాలు పైబడిన వారిని కొత్త ఓటర్లుగా నమోదు, జాబితాలో సవరణలు చేయడం వంటివి చేపడుతామన్నారు. 6,7,8ల ఫారాల నిర్వహణ పకడ్బందీగా ఈ నెల 23వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు. నూతన ఓటరు నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపుపై వచ్చే దరఖాస్తును ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు లోబడి పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాంరెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
జహీరాబాద్: ‘సాక్షి’ కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు బుధవారం అక్రమంగా ఏర్పాటు చేసిన ఇటుక బట్టీలపై కొరడా ఝళిపించారు. ఈనెల 16వ తేదీన ‘సాక్షి’లో ‘పంట పొలాల్లో ఇట్టుక బట్టీలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. బుధవారం జేసీబీ సహాయంతో జహీరాబాద్ మండలంలోని శేఖాపూర్ గ్రామ శివారులో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలను ధ్వంసం చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీల వివరాలను సేకరించారు. ఇప్పటి వరకు 15 వరకు అక్రమ ఇటుక బట్టీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో చిన్న హైదరాబాద్‌లో ఒకటి, హోతి(బి)లో 7, శేఖాపూర్, కొత్తూర్(బి)లో రెండు, ఆనెగుంట గ్రామాల్లో ఒకటి, హోతి(కె)లో 2, జహీరాబాద్‌లో ఒకటి వంతున అక్రమ ఇటుక బట్టీలు ఉన్నట్లు గుర్తించారు. మరిన్ని అక్రమ ఇటుక బట్టీల వివరాలను రెవెన్యూ సిబ్బంది సేకరిస్తున్నారు. ఇటుక బట్టీలకు అనుమతులు పొందాలని, లేనట్లయితే చట్ట పరంగా చర్యలు చేపడుతామని రెవెన్యూ అధికారులు యజమానులను హెచ్చరించారు.
స్పందన
రాజకీయ పార్టీలు సహకరించాలి
ట్రైనీ కలెక్టర్ మనోజ్

ఓటరు జాబితా సవరణ

ఓటరు జాబితా సవరణ