దుబ్బాక : సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతామని కలెక్టర్ మనుచౌదరి, జిల్లా జడ్జి సాయిరమాదేవి అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలో కోర్టు భవనం నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు కమిటీ మేర కు కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి 4 ఎకరాల స్థలం కేటాయించాలన్నారు. జిల్లా న్యాయ, రెవెన్యూ, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ ఇతర అధికారులందరూ కలిసి దుబ్బాకలో కోర్టు నిర్మాణానికి 1.32 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందన్నారు. రెవెన్యూ, సర్వే అధికారులు పూర్తి ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. త్వరలోనే స్థల సేకరణ పూర్తిచేసి భవన నిర్మాణం ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సదానందం, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ సంజీవ్‌కుమార్, ఎంపీడీవో భాస్కరశర్మతో పాటు అధికారులు పాల్గొన్నారు.
పలు కార్యాలయాల సందర్శన
పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ మనుచౌదరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే సమీకృత కార్యాలయాల భవన సముదాయాన్ని పరిశీలించారు. ఖాళీగా ఉన్న గదులు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించేందుకు సంబంధిత అధికారులతో చర్చించాలని తహసీల్దార్ సంజీవ్‌కు సూచించారు.
దుబ్బాక పట్టణంలో కోర్టు కాంప్లెక్స్ భవన నిర్మాణం
స్థల పరిశీలనలో కలెక్టర్ మనుచౌదరి, జిల్లా జడ్జి సాయి రమాదేవి