ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
డంపింగ్‌యార్డ్ పనులు చూసి ఆగిన గుండె
పటాన్‌చెరు/పటాన్‌చెరు టౌన్: నియోజకవర్గ పరిధిలోని ప్రజల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పటాన్‌చెరు మండలం ఐనోల్ గ్రామానికి చెందిన రాములుకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన రూ.2.50లక్షల విలువైన చెక్కును అతని కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు ఇఫ్తార్ విందు
రంజాన్ మాసం సందర్భంగా సోమవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నియోజకవర్గస్థాయి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. గత 25 సంవత్సరాలుగా ప్రతీ ఏటా ముస్లిం సహోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గంగా జమున తెహజీబ్ సంస్కృతికి పటాన్‌చెరు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులందరూ భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ ప్యారానగర్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు పనులు సాగుతుండటం...కూతురు వివాహం కోసం అమ్మకానికి పెట్టిన భూమిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వంటి కారణాలతో మనోవ్యథకు గురైన నల్లవల్లి గ్రామానికి చెందిన నడిమింటి కృష్ణ (37) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా మండలంలో ప్యారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్న కృష్ణ డంపింగ్‌యార్డ్ ఏర్పాటు పనులు చూసి తట్టుకోలేకపోయాడు. కూతురి పెళ్లి చేయడానికి, అప్పులు తీర్చడానికి వేరే దారిలేక తనకున్న భూమిని అమ్మకానికి పెట్టాడు. అయితే ప్యారానగర్‌లో ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తుండటంతో భూముల ధరలు తగ్గిపోవడంతోపాటుగా అక్కడ భూములు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఈ క్రమంలో కృష్ణకు చెందిన భూమిని కొనేందుకు కూడా ఎవరూ రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో ఇంటిదగ్గరే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే కృష్ణ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న జేఏసీ నేతలు కృష్ణ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కృష్ణ మరణం వృథా కాకూడదని డంపింగ్‌యార్డ్ ఏర్పాటును కచ్చితంగా రద్దు చేసేలా పోరాటం సాగిస్తామని జేఏసీ నాయకులు వెల్లడించారు. కృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
నల్లవల్లి గ్రామవాసి మృతి
కూతురు వివాహం కోసం అమ్మకానికి పెట్టిన భూమి
డంపింగ్‌యార్డ్ ఏర్పాటుతో ఎవరూ ముందుకు రాని వైనం
ప్రజల సంక్షేమమే మా లక్ష్యం