
గుర్తు తెలియని వ్యక్తి మృతి
జిన్నారం (పటాన్‌చెరు): గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్డపోతారం గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి కథనం ప్రకారం.. గడ్డపోతారం గ్రామ శివారులో ఓ గుర్తు తెలియని వ్యక్తి (45)ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తలపై తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పారిశ్రామిక వాడలోని ఎంఎస్‌ఎన్ పరిశ్రమలో పనిచేసే కార్మికుడు ముత్తావరపు సతీశ్ ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.