
ఎస్సీ రైతులకు ప్రోత్సాహం
రైతు నేస్తం కృషి విజ్ఞాన కేంద్రం●
● సాంకేతిక సహాయం, క్షేత్ర పర్యటనలు ● జీవన ఎరువు, నీమ్ ఆయిల్, విత్తనాలు, నారు పంపిణీ ● ప్రకృతి, సేంద్రియ సాగుపై రాయిలాపూర్, తునికి, పోతిరెడ్డిపల్లి అన్నదాతలకు శిక్షణ
రైతులకు మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో ఏర్పాటైన కృషి విజ్ఞాన కేంద్రం ఆధునిక సాంకేతికతను చేరువ చేయడంతోపాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తోంది. ప్రకృతి, సేంద్రియ సాగులో శిక్షణ అందిస్తూ ఎస్సీ రైతులను ప్రోత్సహిస్తోంది.
కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి మండలంలోని తునికి వద్దగల డాక్టర్ డి.రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో రైతులకు సాగుపై అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికే రెండు గ్రామాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి 500 మంది రైతులతో సేంద్రియ సాగు చేయిస్తోంది. మండలంలోని తునికి, రాయిలాపూర్, కొల్చారం మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామాలను ఎంపిక చేసి ఎస్సీ రైతులకు ప్రత్యేక శిక్షణతోపాటు ప్రోత్సాహకాలు సైతం అందిస్తున్నది. ప్రత్యేకంగా షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక ద్వారా ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసర్చ్) సహకారంతో కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళిక ఇన్‌చార్జి, శాస్త్రవేత్త శ్రీనివాస్, కేవీకే శాస్త్రవేత్తలు ఎస్సీ రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అయితే 40 శాతం ఎస్సీ జనాభా ఉన్న గ్రామాలను ఎంపిక చేసి శిక్షణనిస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో మరిన్ని గ్రామాల్లో ఎస్సీ రైతులకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రెతుల ఆర్థికాభివృద్ధికి కృషి
ఐసీఏఆర్ సహకారంతో కేవీకే ఆధ్వర్యంలో ఎస్సీ రైతుల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. క్షేత్ర స్థాయిలో రైతులకు సాగుపై ప్రత్యేక శిక్షణతో పాటు అవగాహన కల్పిస్తున్నాం. రైతులు పూర్తి స్థాయిలో సేంద్రియ, ప్రకృతి సాగుకు ముందుకు రాకపోవడంతో కొద్దికొద్దిగా సాగు చేయిస్తున్నాం. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.
– శ్రీనివాస్, షెడ్యూల్డ్ కులాల
ఉపప్రణాళిక ఇన్‌చార్జి, శాస్త్రవేత్త
సహకారం బాగుంది
కేవీకే సహకారం బాగుంది. ఎకరంలో సేంద్రియ సాగు చేస్తున్నా. కేవీకే శాస్త్రవేత్తలు వరి విత్తనాలు, కూరగాయల నా రు, కోడిపిల్లలు అందజేశారు. కేవీకేలో సేంద్రి య సాగు, చీడపీడల నివారణపై శిక్షణ ఇచ్చా రు. పంటలో సమస్యలు వస్తే ఫోన్ చేస్తే స్పందించి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రస్తు తం వరితోపాటు కూరగాయలు, ఉల్లిగడ్డ సాగు చేస్తున్నా. –సాయిలు, రైతు, పోతిరెడ్డిపల్లి
సాగుపై రైతులకు అవగాహన
ఎంపిక చేసిన ఎస్సీ రైతులకు క్షేత్ర స్థాయి పర్యటనలు నిర్వహించి సాగుపై శిక్షణనిస్తున్నారు. కేవీకేలో పలు పంటలను సాగు చేసే విధానం, విత్తనం నాటడం మొదలు పంట కోతకు వచ్చేవరకు జీవామృతం, బీజామృతం తయారీ, జీవన ఎరువుల వినియోగం, చీడపీడల నివారణ, వివిధ ఆకులతో కషాయాల తయారీ, నీమ్ ఆయిల్ వాడకంపై అవగాహన కల్పించారు. ఎస్సీ రైతులకు వానాకాలం, యాసంగికి గాను ఎరువులు, వర్మీకంపోస్ట్, కేఎన్‌ఎం1638 వరి విత్తనాలు, టమాట, మిరప, ఉల్లినారుతోపాటు అదనపు ఆదాయం కోసం ప్రియాబ్రీడ్ నాటుకోడి పిల్లల పంపిణీ, కలుపు తీసే యంత్రం, స్ప్రేయ ర్లు అందజేశారు. అలాగే భూసార పరీక్షలు చేయించి దాని ఆధారంగా ఏ పంట వేయాలి? ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో మెలుకువలు నేర్పి మూడేళ్లుగా ప్రోత్సహిస్తున్నారు.

ఎస్సీ రైతులకు ప్రోత్సాహం

ఎస్సీ రైతులకు ప్రోత్సాహం

ఎస్సీ రైతులకు ప్రోత్సాహం

ఎస్సీ రైతులకు ప్రోత్సాహం