సంగారెడ్డి క్రైమ్: అనారోగ్య సమస్యలు భరించలేక చెరువులో దూకి గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ రమేశ్ కథనం ప్రకారం... కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన గూడెం రత్నయ్య, రత్నమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కూమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గత ఏడాది కుమారుడు చనిపోవడంతో, రత్నమ్మ (40) కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో రోజు రోజుకు ఎక్కువ అవ్వడంతో నొప్పిని తట్టుకోలేక పోయింది. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది. కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం సంగారెడ్డి శివారులోని మహబూబ్ సాగర్ చెరువులో మృతదేహం బయటకు తేలింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి రత్నమ్మగా గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మద్యానికి బానిసై ఉరివేసుకొని..
దుబ్బాకరూరల్: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అక్బర్‌పేట భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్‌ఐ హరీశ్ కథనం ప్రకారం... సిర్ర ఎల్లయ్య (43) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి మద్యానికి అలవాటు పడి ఇంటికి వచ్చి భార్యతో తరచుగా గొడవ పడు తుండేవాడు. మద్యం తాగవద్దని భార్య చెప్పినా వినేవాడు కాదు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో పశువులకు గడ్డి కోసుకువస్తానని ఇంట్లో చెప్పి పొలం వద్దకు వెళ్లాడు. ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చి పొలం దగ్గరకు వెళ్లి చూడగా తాడుతో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కూతు రు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చెరువులో దూకి గృహిణి ఆత్మహత్య