చేగుంట(తూప్రాన్): పొలం పనులు చేసే సమయా ల్లో కొన్ని సందర్భాల్లో పీపీఈ కిట్లు ధరించాలని సింజెంటా సీడ్స్ మేనేజర్ సత్తిరెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని పొలంపల్లి గ్రామాన్ని సింజెంటా గ్లోబల్ టీమ్ సభ్యులు సందర్శించి రైతులకు సూచనలు చేసారు. మేనేజర్ మాట్లాడుతూ.. రైతులు సస్యరక్షణ చర్యల సమయంలో భద్రత కోసం ప్రత్యేక కిట్లు ధరించాలని తెలిపారు. అనంతరం సింజెంటా టీమ్ సభ్యులు రైతులతో మాట్లాడి వ్యవసాయం గ్రామంలో జరుగుతున్న వ్యవసాయం గురించి అడిగి తెలుసుకున్నారు. తమ వంతు సాయంగా గ్రామంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని సింజెంటా ప్రతినిధులు తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రామ రైతులు సింజెంటా ప్రతినిథులు పాల్గొన్నారు.
పొలంపల్లి గ్రామాన్ని సందర్శించిన
సింజెంటా గ్లోబల్ టీమ్ సభ్యులు