
నకిలీ ఔషధాలు తయారు చేయడం లేదు
మర్కూక్(గజ్వేల్): మండలంలోని కర్కపట్లలో ఉన్న జోడాస్ ఎక్స్ పోయిమ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో నకిలీ ఔషధాలు తయారు చేయడం లేదని జోడాస్ పరిశ్రమ హెచ్‌ఆర్ శ్రీకాంత్, నూకరాజు తెలిపారు. బుధవారం పరిశ్రమలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ ఔషధాల ప్యాకింగ్ కవర్లపై రష్యా భాషలో ముద్రించడంతో కొంతమంది బాహ్య వాటాదారులు నకిలీ మందులు పంపిణీ చేస్తున్నారని నకిలీ ఔషధ పంపిణీ కేసుగా చిత్రీకరించారన్నారు. ఈ సమస్య రష్యాలో విస్తరించడంతో ఔషధ పంపిణీ విషయంలో తమ పరిశ్రమకు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. పరిశ్రమ యజమానులు తమ నివేదికలను డీసీఏ తెలంగాణకు సమర్పించారని వెంటనే వాటిని డ్రగ్ కంట్రోల్ అధికారులు పరిశీలించి కాంట్రాక్ట్ మాన్యూ ఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్( సీఎంఓ) ద్వారా చట్టబద్ధంగా తయారు చేయబడ్డాయని స్పష్టం చేశారన్నారు. అందుకు గాను ధ్రువీకరణ పత్రాలను అధికారులు బుధవారం అందించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించిన ఔషధాలను మాత్రమే తయారు చేసి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
సీఎంఓ ద్వారా చట్టబద్ధంగా
ధ్రువీకరించారు
జోడాస్ పరిశ్రమ హెచ్‌ఆర్ శ్రీకాంత్