
న్యూమోనియాతో బాధపడుతూ నాలుగేళ్ల చిన్నారి
సిద్దిపేటజోన్: న్యూమెనియాతో బాధపడుతున్న నాలుగేళ్ల పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన బుధవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. సిద్దిపేట పట్టణానికి చెందిన శ్రీకాంత్ చారి, స్వాతిల ఏకై క కుమార్తె మాన్విత(4) 12 రోజుల కిందట అస్వస్థతకు గురికాగా స్థానిక సందీప్ చిల్డ్రన్ ఆస్పత్రిలో చేర్పించారు. నాటి నుంచి న్యూమోనియాతో బాధపడుతూ చికిత్స పొందుతుంది. బుధవారం అకస్మాతుగా పాప పరిస్థితి విషమించి మృతి చెందింది. ఇంజక్షన్ ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే పాప పరిస్థితి విషయంగా మారి చనిపోయిందని, వైద్యుల నిర్లక్ష్యం కారణంతోనే పాప చనిపోయిందని బంధువులు ఆరోపించారు. పాపను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, ఇందులో మా నిర్లక్ష్యం ఏమిలేదని ఆసుపత్రి నిర్వహకులు పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.