
రెండు ఆటోలు ఢీ :
ఆరుగురికి తీవ్ర గాయాలు
హుస్నాబాద్: రెండు ఆటోలు ఢీ కొనడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వేలేరు గ్రామానికి చెందిన మణికంఠ, పవన్, సాయి, దిలీప్, అలుగునూర్‌కు చెందిన గణేశ్ పట్టణంలోని ఆరపల్లె వద్ద జరిగిన ఓ శుభకార్యానికి వచ్చారు. కొద్దిసేపటికి పని నిమిత్తం ఆటోలో బస్టాండ్‌కు వెళ్లారు. ఇదే సమయంలో సిద్దిపేట రోడ్ నుంచి కరీంనగర్‌కు మహీంద్ర మాక్సిమో ఆటో వాహనం వెళ్తుంది. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్దకు రాగానే రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొని నుజ్జు నుజ్జయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, మాక్సిమోలో ఉన్న విజయ్ అనే యువకుడి కాలు విరిగింది. ఐదుగురు క్షతగాత్రులను హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి, విజయ్‌ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

రెండు ఆటోలు ఢీ :