
ఇక ప్రజలకు విస్తృత సేవలు
జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్
జహీరాబాద్: పార్లమెంట్ కేంద్రమైన జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయం ద్వారా ప్రజలకు మరింత విస్తృతమైన సేవలు అందించనున్నట్లు ఎంపీ సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. జహీరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ పరిధిలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్, బాన్సువాడ అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా జహీరాబాద్ క్యాంపు కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. పార్లమెంట్ క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జిగా సీనియర్ నాయకుడు పస్తాపూర్‌కు చెందిన జి.శుక్లవర్ధన్‌రెడ్డిని నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, ఐడీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎం.డి.తన్వీర్, కాంగ్రెస్ నాయకులు పి.నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శౌకత్, భాస్కర్‌రెడ్డి, మక్సూద్, అర్షద్, అశోక్, అస్మాతబస్సుమ్ పాల్గొన్నారు.