
చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని చంద్లాపూర్ గ్రామం దేశంలోనే అత్యుత్తమ పర్యాటక ప్రాంతంగా అరుదైన ఘనత సాధించింది. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సూరగోని చంద్రకళ రవి, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ అజయ్ భట్ నుంచి అవార్డు అందుకున్నారు. గ్రామం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని, ప్రాంత ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేశారు. 4,500 జనాభా ఉన్న ఈ గ్రామంలో రంగనాయకస్వామి ఆలయం ప్రత్యేకం. అలాగే రంగనాయక సాగర్ రిజర్వాయర్ గ్రామానికి మణిహారంగా మారింది. సాంస్కృతిక, పర్యాటక రంగాలలో అభివృద్ధి సాధిస్తూ ప్రణాళిక బద్దంగా చేపట్టిన కార్యక్రమాలతో సాధించిన ప్రగతి నేడు గ్రామాన్ని జాతీయ స్థాయిలో నిలపింది.
ఢిల్లీలో అవార్డు అందుకున్న గ్రామ సర్పంచ్
ప్రజలకు దక్కిన గౌరవం..
సిద్దిపేటకు గోదావరి జలాల తరలింపు.. అందుకు ప్రతిఫలం దక్కడం ఒక చరిత్ర. చంద్లాపూర్ నేడు టూరిజం విలేజీగా జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ప్రజలకు, రిజర్వాయర్ కోసం భూమి త్యాగం చేసిన వారికి దక్కిన గౌరవమన్నారు. ఢిల్లీలో అవార్డు అందుకున్న గ్రామ సర్పంచ్ చంద్రకళకు శుభాకాంక్షలు.
–హరీశ్‌రావు, మంత్రి
Comments
Please login to add a commentAdd a comment