
నార్కోటిక్స్ డాగ్స్‌తో తనిఖీలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): నార్కోటిక్స్ డాగ్స్‌తో సిద్దిపేట టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కిరాణా షాపులు, పాన్ షాప్స్, హోటల్స్ ఇతర అనుమానాస్పద ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా, కలిగి ఉన్నా చట్టరీత్యా నేరమన్నారు. మత్తుపదార్థాలపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే డయల్ 100, యాంటీ నార్కటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1908, పోలీస్‌లకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో టూ టౌన్ ఎస్‌ఐ శ్రీనివాస్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు విజయ్ కుమార్, రమేశ్, పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment