రేవంత్ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత
● 317 జీఓకు వ్యతిరేకంగాపోరాడింది బీజేపీయే
● మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్
గజ్వేల్‌రూరల్: రాష్ట్రంలో కేసీఆర్ పదేళ్ల పాలన, రేవంత్‌రెడ్డి ఏడాది పాలనలోనే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సిద్దిపేట గజ్వేల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. పట్టభద్రులు, టీచర్లు సామాజిక దృక్పథం ఉన్నవారని, ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందోననే ఆలోచనతో ఓటు వేస్తారన్నారు. ఉపాధ్యాయుల బదిలీల సమయంలో 317 జీఓను తీసుకువస్తే దానికి వ్యతిరేకంగా పోరాడింది బీజేపీయేనని గుర్తు చేశారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ టీచర్ల దుఃఖానికి కారణమవుతుందని అన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి నాణ్యమైన యువశక్తిని తయారు చేయాలనే సంకల్పంతో బడ్జెట్‌లో రూ.4లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment