సాగు నీరు అందించాలంటూ ర్యాలీ
కొమురవెల్లి(సిద్దిపేట): చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాలలోని 133 చెరువులను తపాస్‌పల్లి రిజర్వాయర్ ద్వారా నింపి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో మండల కేంద్రం నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్‌లో భాగంగా తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను చేర్యాల ప్రాంత రైతులకు నీరందించేందుకు నిర్మించారని, కానీ రిజర్వాయర్‌లో నీరు లేక వెలవెలబోతుందని అన్నారు. రిజర్వాయర్‌ను నింపిన ప్రతిసారీ చేర్యాల ప్రాంత చెరువులు నింపకుండా ఆలేరు, సిద్దిపేటకు నీటిని తరలించడంపై మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈప్రాంత రైతులను కాపాడాలని కోరారు. ఎప్పటికే వరి సాగు పొట్ట దశలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట్ మావో, ఆలేటి యాదగిరి, బండకింది అరుణ్‌కుమార్, తాడూరి రవీందర్, బద్దిపడిగె కృష్ణారెడ్డి, దాసరి ప్రశాంత్, అత్తిని శారద, మద్దూరు మండల కార్యదర్శి షఫీ, చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment