ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఈశ్వర్ అన్నారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకి ఓటు వేసి గెలిపిద్దామని, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఈశ్వర్ అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో బుధవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి ఎంతోమంది పేదలకు బాసటగా నిలిచిన ప్రసన్న హరికృష్ణను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు శ్రీరామ్‌కృష్ణ, లింగంపల్లి యాదగిరి, వెంకట్, వెంకటేశ్వర్లు, ఓం ప్రకాష్, శంకర్, నరేష్, పుల్లూరు ఉమేష్, రాజు, సంపత్, బాబు, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో..
సిద్దిపేటకమాన్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడు రవీంద్రసింగ్‌ను గెలిపించాలని శాతావహన జేఏసీ చైర్మన్ వ్యవస్థాపకుడు చైతన్య కోరారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యా వ్యాపారవేత్తలకు, విద్యావంతులకు జరుగుతున్న ఎన్నిక అన్నారు. అందరూ కూడా ఆలోచించి ఓటు వేయాలని, ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నరేష్, అశోక్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఈశ్వర్
Comments
Please login to add a commentAdd a comment