కేంద్ర బడ్జెట్‌పై సీపీఎం నిరసన
సిద్దిపేటఅర్బన్: కార్పొరేట్ శక్తులకు మేలు కలిగించేలా ఉన్న కేంద్ర బడ్జెట్‌పై సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. బుధవారం సిద్దిపేటలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గోపాలస్వామి మాట్లాడుతూ రైతాంగానికి సంబంధించిన బడ్జెట్ అంటూనే కేటాయింపుల్లో కోత పెట్టారన్నారు. వ్యవసాయ రంగానికి తగిన విధంగా నిధులు కేటాయించలేదన్నారు. ఉపాధి హామీ పథకానికి సైతం అరకొరగా కేటాయింపులు చేశారని ఆరోపించారు. సవరించి ప్రజానుకూల బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎల్లయ్య, సత్తిరెడ్డి, భాస్కర్, వెంకట్, యాదగిరి, అరుణ్‌కుమార్, బాలనర్సయ్య, నవీన, శారద, కృష్ణారెడ్డి, ప్రశాంత్, రంజిత్‌రెడ్డి, సంజీవ్, అభినవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment