
సీఎంకు పీపీ జీవన్‌రెడ్డి కృతజ్ఞతలు
సిద్దిపేటకమాన్: తనకు రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అడ్వకేట్ జీవన్‌రెడ్డి తెలిపారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా కోర్టుకు మొట్టమొదటి రెగ్యులర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రాష్ట్ర ప్రభుత్వం తనకు అవకాశం కల్పించిందన్నారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడడంతో పాటు నిందితులకు శిక్షలు పడే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో అడ్వకేట్ పత్రి ప్రకాశ్, ఖలిమొద్దీన్ పాల్గొన్నారు.