ముంబై: మూగ జీవుల పట్ల కొందరు క్రూరంగా ప్రవర్తిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు. అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని చంద్రాపుర్‌లో సోమవారం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు కిరాతకులు ఓ వీధి శునకాన్ని చంపేసేందుకు దాని మెడకు పెద్ద బండరాయిని కట్టి వరద నీటిలో పడేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన బల్లార్‌పుర్ తహసీల్‌లోని దహెలి గ్రామంలో వారం క్రితం జరిగినట్లు తెలుస్తోంది.
నీటిలో పడేయకుండా ఆ శునకం ఎంత ప్రయత్నించినా వారు కనికరించలేదు. బలవంతంగా నీటిలోకి ఈడ్చిపడేశారు. నీటిలో పడిపోయిన ఆ కుక్క.. అతి కష్టంపై వరదలోంచి బయటపడగలిగింది. అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు రక్షించుకుంది. ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. తక్కువ సమయంలోనే ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
The incident happened 3 days back on 13 July 22 in Daheli village , Bamni (Ballarsha) and the person name is Dinkar Gaikwad.(maharashtra)
— 🇮🇳Pratham Bisht (@PrathamBisht12) July 18, 2022
Please share the video !! And give justice to poor Dog.@asharmeet02 @pfaindia @MumbaiPolice @DGPMaharashtra @TheJohnAbraham @SonuSood pic.twitter.com/T89nZF8vVB
కేసు నమోదు..
వీడియో వైరల్‌గా మారిన క్రమంలో ఓ జంతు ప్రేమికుల సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు నిందితులపై ఐపీసీలోని సెక్షన్ 11(1)(ఏ)(ఎల్), 119, 34 ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: హెల్మెట్ ధరించిన బస్సు డ్రైవర్.. చిత్రాలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment