భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం.. అద్భుతం చేసిన అథ్లెట్లు | 4x400m womens relay: India Won gold at 2026 Asian Games | Sakshi
Sakshi News home page

భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం.. అద్భుతం చేసిన అథ్లెట్లు

Sep 29 2026 6:04 PM | Updated on Sep 29 2026 6:46 PM

4x400m womens relay: India Won gold at 2026 Asian Games

PC: Sonysports

ఆసియా క్రీడలు-2026లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఐచీ నగోయా వేదికగా భారత మహిళల రిలే జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. కిరణ్‌ పహల్‌, మచెట్టిర పూవమ్మ, ప్రాచీ, విద్య రామ్‌రాజ్‌లతో కూడిన జట్టు 4*400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది.

మంగళవారం నాటి పోటీలో 3:29.69 నిమిషాల వ్యవధిలో భారత మహిళలు ఈవెంట్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచారు. బహ్రెయిన్‌ అథ్లెట్లు 3:30.21, చైనా బృందం 3:31.02 సెకన్ల వ్యవధిలో పరుగు పూర్తి చేసి వరుసగా రజత, కాంస్య పతకాలు అందుకున్నారు. ఇదిలా ఉంటే.. రిలే మహిళల స్వర్ణంతో తాజా ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌ పసిడి పతకాల సంఖ్య ఆరుకు చేరింది.

హాఫ్‌ సెంచరీ దాటేశాము
మరోవైపు.. 4*400 మీటర్ల రిలే ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో తాజా ఆసియా క్రీడల్లో భారత్‌ మొత్తం పతకాల సంఖ్య ఇప్పటికి 52 (6 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్యాలు)కి చేరింది.

విద్య రామ్‌రాజ్‌కు మూడో పతకం
విద్యా రామ్‌రాజ్‌ ఇప్పటికే మిక్స్‌డ్‌ 4*400 మీటర్ల రిలేలో వెండి, 400 మీటర్ల హార్డిల్స్‌లో కాంస్య పతకాలు గెలిచింది. తాజాగా మహిళల 4*400 రిలేలో ఏకంగా స్వర్ణం సాధించింది. 

ఇప్పటి వరకు భారత్‌ ఖాతాలో ఆరు పసిడి పతకాలు
👉మహిళల క్రికెట్‌ జట్టు
👉పురుషుల కబడ్డీ జట్టు
👉మహిళల కబడ్డీ జట్టు
👉నీరూ ధండా- షూటింగ్‌ (ట్రాప్‌ వుమెన్‌ సింగిల్‌)
👉10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌- షూటింగ్‌
👉4*400 మీటర్ల రిలే (మహిళలు)

చదవండి: చరిత్ర సృష్టించిన గుల్వీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement