టీమిండియా అత్యుత్తమ వన్డే ప్లేయింగ్ ఎలెవెన్‌ను భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ప్రకటించాడు. అతడు ఎంపిక చేసిన జట్టులో భారత విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. వన్డేల్లో భారత ఆటగాళ్ల ప్రస్తుత ప్రదర్శనల ఆధారంగా చోప్రా తన అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు.
ఇక బంగ్లాదేశ్‌తో ఆఖరి వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన భారత యువ ఓపెనర్ ఇషాన్ కిషన్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. తన జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌ను చోప్రా ఎంపిక చేశాడు. టాప్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌కు అతడు అవకాశమిచ్చాడు.
ఇక ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌కు చోటు దక్కింది. తన జట్టులో స్పెషలిస్టు స్పిన్నర్‌గా యజువేంద్ర చాహల్‌కు అతడు చోటిచ్చాడు. అదే విధంగా పేస్ బౌలర్లగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌ను మాత్రమే అతడు ఎంపిక చేశాడు.
ఆకాష్ చోప్రా ఎంచుకున్న భారత ప్లేయింగ్ ఎలెవన్
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
చదవండి: బంగ్లాతో తొలి టెస్ట్.. పంత్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ, అతడి స్థానంలో..!
Comments
Please login to add a commentAdd a comment