స్వదేశంలో శ్రీలంకతో తొలి పోరుకు టీమిండియా సిద్దమైంది. లక్నో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య తొలి టీ20 గరువారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆటగాళ్లు లేకుండానే భారత్ బరిలోకి దిగనుంది. ఈ సిరీస్‌కు విరాట్ కోహ్లి, పంత్, సూర్యకూమార్ యాదవ్, దీపక్ చాహర్‌లు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో లంకతో తొలి టీ20కు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఎంచుకున్నాడు. తన జట్టులో ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రుత్‌రాజ్ గైక్వాడ్‌ను ఎంచుకున్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మకి మూడో స్ధానంలో అవకాశం ఇచ్చాడు.
నాలుగు, ఐదు స్ధానాల్లో వరుసగా శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడాకు చోటు దక్కింది. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో వెంకటేశ్ అయ్యర్, రవీంద్ర జడేజాను చోప్రా ఎంపిక చేశాడు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌కు చోటు ఇచ్చాడు. ఇక తన జట్టులో ఏకైక స్పిన్నర్‌గా యజువేంద్ర చాహల్‌ను చోప్రా ఎంచుకున్నాడు. కాగా చోప్రా ప్రకటించిన జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కక పోవడం గమనార్హం.
ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత ప్లేయింగ్XI: రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్
చదవండి: Ind Vs SL T20I: 'టీమిండియా ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ వద్దు... అతడికి అవకాశం ఇవ్వండి'
Comments
Please login to add a commentAdd a comment