
ముఖ్యంగా డివిలియర్స్ కుమారుడు ఒకింత అసహనానికి గురయ్యాడు. దీంతో తన ముందు వరుసలో ఉన్న కుర్చీ..
AB de Villiers’ son expresses disappointment: ఐపీఎల్2021 సెకండ్ ఫేజ్‌లో భాగంగా ఆదివారం మంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఏబీ డివిలియర్స్ వికెట్ కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే చెలరేగి ఆడతాడు అనుకున్న డివిలియర్స్ మరోసారి అభిమానులను నిరాశ పరిచాడు.
ఈ క్రమంలో మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన అతడి భార్య, పిల్లలను డివిలియర్స్ ఔట్ కావడం తీవ్ర నిరాశపరిచింది. ముఖ్యంగా డివిలియర్స్ కుమారుడు ఒకింత అసహనానికి గురయ్యాడు. దీంతో తన ముందు వరుసలో ఉన్న కుర్చీపై చేతితో బలంగా గుద్దాడు. అయితే, కొడుకు రియాక్షన్ చూసి పక్కన ఉన్న అతని తల్లి షాక్‌కు గురైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో 6 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఏబీడీ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
చదవండి: బిగ్‌బాష్ టి20 లీగ్‌లో తొలిసారిగా ఆడనున్న భారత స్టార్ ఆల్‌రౌండర్..
Me after watching bhaubali
#RCBvsMI pic.twitter.com/Oe0QJb6XgS
— ANMOL KAUR (@anmol_banga) September 26, 2021