
లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సుదీర్ఘ విరామం లభించడంతో టీమిండియా క్రికెటర్లు కుటుంబాలతో ఉల్లాసంగా గడుపుతున్నారు. ఇంగ్లండ్ వీధుల్లో విహరిస్తూ మధుర జ్ఞాపకాలను కెమెరాల్లో బంధించుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబాలు ఒకే ఫ్రేములో ఉన్న ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. కూతుళ్లను ఎత్తుకుని రహానే, రోహిత్ ఇచ్చిన ఫోజు భలేగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
‘‘ఇండోర్‌కే పరిమితం అయిన చిన్నారులు.. వారి డే అవుట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు’’ అనే క్యాప్షన్‌తో రహానే ఈ ఫొటోను పంచుకున్నాడు. ఇందులో రహానే తన ముద్దుల తనయ ఆర్యను ఎత్తుకోగా, హిట్‌మాన్ రోహిత్ తన గారాలపట్టి సమైరాతో కలిసి చిరునవ్వులు చిందించాడు. కాగా రహానే 2014లో రాధికా ధోపవ్‌కర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన ఐదేళ్ల తర్వాత వీరికి కూతురు ఆర్య జన్మించింది.
ఇక 2015లో ప్రేమ వివాహం చేసుకున్న రోహిత్ శర్మ- రితికా సజ్దే దంపతులకు సమైరా శర్మ సంతానం. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియా ఆగష్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడనుంది. డబ్ల్యూటీసీ సెకండ్ ఎడిషన్ పోటీలో ఐదు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్ మొదటిది.
ఫ్యామిలీతో ఉన్న ఫొటోలు షేర్ చేసిన క్రికెటర్లు..
చదవండి: WTC 2021-23: టీమిండియా షెడ్యూల్ ఖరారు.. ఇంగ్లండ్ సిరీస్‌తో షురూ
Comments
Please login to add a commentAdd a comment