PC: CA, ECB
Ashes Series 2021 22 Boxing Day Test: యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు వైఫల్యం కొనసాగుతోంది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయింది. కెప్టెన్ జో రూట్ ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి నిలువలేక పెవిలియన్‌కు వరుస కట్టారు. దీంతో 65.1 ఓవర్లలో 185 పరుగుల వద్ద రూట్ బృందం తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. కాగా బాక్సింగ్ డే టెస్టులో భాగంగా టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు హసీబ్ హమీద్(డకౌట్), జాక్ క్రాలే(12 పరుగులు) ఘోరంగా విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన డేవిడ్ మలన్ సైతం 14 పరుగులకే నిష్క్రమించాడు. జో రూట్, స్టోక్స్, బెయిర్ స్టో, బట్లర్, మార్క్ వుడ్, ఓలీ రాబిన్సన్, జాక్ లీచ్, ఆండర్సన్ వరుసగా... 50, 25,35,3,6,22,13,0 స్కోర్లు నమోదు చేశారు.
ఆసీస్ బౌలర్లలో కెప్టెన్‌కు ప్యాట్ కమిన్స్, నాథన్ లియాన్‌లకు అత్యధికంగా మూడేసి వికెట్లు దక్కాయి. స్టార్క్ 2, అరంగేట్ర ఆటగాడు బోలాండ్ ఒకటి, కామెరూన్ గ్రీన్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
చదవండి: India Vs SA: భారత అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త కెప్టెన్ వచ్చేస్తున్నాడు!
Ind Vs Sa 1st Test: తొలి టెస్టు డ్రా అవుతుంది.. ఎందుకంటే: టీమిండియా మాజీ క్రికెటర్
Scott Boland's on the board in Test cricket!
— cricket.com.au (@cricketcomau) December 26, 2021
Test wicket No.1! ✨ #Ashes | @VodafoneAU pic.twitter.com/5Rp0b6tlo3
Scott Boland's on the board in Test cricket!
— cricket.com.au (@cricketcomau) December 26, 2021
Test wicket No.1! ✨ #Ashes | @VodafoneAU pic.twitter.com/5Rp0b6tlo3
Comments
Please login to add a commentAdd a comment