Australia and Afghanistan To Play in T20Is For First Time - Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: టీ20 క్రికెట్ చరిత్రలో.. ఆఫ్గానిస్తాన్‌- ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌

Published Sat, Oct 8 2022 2:26 PM | Last Updated on Sat, Oct 8 2022 2:52 PM

Australia and Afghanistan to play in T20Is for first time - Sakshi

ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్‌ జట్లు ఇప్పటి వరకు చాలా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాయి. కానీ ఇరు జట్లు ఇప్పటి వరకు ముఖా ముఖి ఒక్క టీ20 మ్యాచ్‌లో తలపడ లేదంటే నమ్మశక్యం కాని విషయం. అవును ఇది నిజం. టీ20 క్రికెట్‌ చరిత్రలో ఆఫ్గాన్‌- ఆస్ట్రేలియా జట్లు ఇప్పటి వరకు ఒక్క టీ20 మ్యాచ్‌లో కూడా తలపడలేదు.

అయితే టీ20 ప్రపంచకప్‌-2022లో ఆఫ్గాన్‌- ఆస్ట్రేలియా జట్లు తమ తొలి టీ20 మ్యాచ్‌ ఆడనున్నాయి. ఈ మెగా ఈవెంట్‌ సూపర్‌-4లో భాగంగా నవంబర్‌4న ఆడిలైడ్‌ వేదికగా ఆఫ్గాన్‌, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

కాగా ఇప్పటి వరకు ఆసీస్‌, ఆఫ్గానిస్తాన్‌ కేవలం మూడు సార్లు వన్డేల్లో మాత్రమే ముఖాముఖి తలపడ్డాయి. ఇక ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌-2022 ఆక్టోబర్‌ 15 నుంచి ప్రారంభం కానుంది. తొలుత రౌండ్‌-1 మ్యాచ్‌లు జరగనుండగా.. ఆక్టోబర్‌-22 నుంచి సూపర్‌-12 పోటీలు మొదలకానున్నాయి.

టీ20 ప్రపంచకప్‌-2022కు అఫ్గనిస్తాన్‌ జట్టు:
మహ్మద్‌ నబీ(కెప్టెన్‌), నజీబుల్లా జద్రాన్‌, రహ్మనుల్లా గుర్బాజ్‌(వికెట్‌ కీపర్‌), హజ్రతుల్లా జజాయ్‌, కైస్‌ అహ్మద్‌, ఉస్మాన్‌ ఘని, ముజీబ్‌జద్రాన్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, సలీం సఫీ, రషీద్‌ ఖాన్‌, ఇబ్రహీం జద్రాన్‌, డార్విష్‌ రసూలీ, ఫజల్‌ హక్‌ ఫారుకీ, ఫరీద్‌ అహ్మద్‌ మాలిక్‌, నవీన్‌ ఉల్‌ హక్‌.

రిజర్వు ప్లేయర్లు:
అఫ్సర్‌ జజాయ్‌, షరాఫుదీన్‌ అష్రఫ్‌, గుల్‌బదిన్‌ నాయీబ్‌, రహ్మత్‌ షా.

టీ20 ప్రపంచకప్‌-2022కు ఆస్ట్రేలియా జట్టు
ఆరోన్ ఫించ్ (సి), ఆష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవెన్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా.

చదవండిWomen's Asia Cup 2022:33 పరుగులకే ఆలౌట్‌.. మలేషియాపై శ్రీలంక ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement