స్వదేశంలో అఫ్ఘనిస్తాన్ చేతిలో వైట్‌వాష్ అయ్యే ప్రమాదాన్ని బంగ్లాదేశ్ తప్పించుకుంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 0-2తో వెనుకపడిన బంగ్లా జట్టు.. ఇవాళ (జులై 11) జరిగిన మూడో వన్డేలో గెలుపొందడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించి, ఘోర పరాభవం ఎదుర్కోకుండా బయటపడగలిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. 45.2 ఓవర్లలో 126 పరుగులకే చాపచుట్టేయగా, బంగ్లాదేశ్ 23.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విజృంభించడంతో వారి జట్టు సునాయాస విజయాన్ని సాధించింది.
తొలుత బౌలింగ్‌లో షోరీఫుల్ ఇస్లాం (4/21), తస్కిన్ అహ్మద్ (2/23), తైజుల్ ఇస్లాం (2/33), షకీబ్ అల్ హసన్ (1/13), మెహిది హసన్ (1/35) చెలరేగగా.. ఆతర్వాత బ్యాటింగ్‌లో లిటన్ దాస్ (53 నాటౌట్), షకీబ్ (39), తౌహిద్ హ్రిదోయ్ (22 నాటౌట్) రాణించారు.
ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో అజ్మతుల్లా (56) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించగా.. మిగతా వారంతా విఫలమయ్యారు. షాహిది (22), నజీబుల్లా (10), ముజీబ్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ సిరీస్‌లో జరిగిన తొలి రెండు వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ వరుస విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లా పర్యటనలో తదుపరి 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. జులై 14, 16 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment