BCCI Announces Home Series Against Sri Lanka and New Zealand, Australia, Check Venue and Dates Inside - Sakshi
Sakshi News home page

Team India Schedule: స్వదేశంలో టీమిండియా వరుస సిరీస్‌లు.. షెడ్యూల్‌ విడుదల

Published Thu, Dec 8 2022 1:12 PM | Last Updated on Thu, Dec 8 2022 3:22 PM

BCCI Announces Home Series Against Sri Lanka New Zealand Australia - Sakshi

టీమిండియా (PC: BCCI)

Team India Schedule 2023 Jan- March: బంగ్లాదేశ్‌ పర్యటన ముగిసిన తర్వాత స్వదేశంలో వరుస సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. శ్రీలంక, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి గురువారం విడుదల చేసింది.

తొలుత శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లు ఆడనున్న భారత జట్టు.. తర్వాత కివీస్‌తో వరుసగా 3 మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. అనంతరం.. వరల్డ్‌టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ 2021-23 సీజన్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఆ తర్వాత ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడేందుకు టీమిండియా షెడ్యూల్‌ ఖరారైంది. 

శ్రీలంక భారత పర్యటన: జనవరి 3- జనవరి 15
టీ20 సిరీస్‌తో ఆరంభం- వన్డే సిరీస్‌తో ముగింపు
టీ20 సిరీస్‌
1. జనవరి 3- ముంబై
2. జనవరి 5- పుణె
3. జనవరి 7- రాజ్‌కెట్‌

వన్డే సిరీస్‌
1. జనవరి 10- గువాహటి
2. జనవరి 12- కోల్‌కతా
3. జనవరి 15- త్రివేండ్రం

న్యూజిలాండ్‌ భారత పర్యటన: జనవరి 18- ఫిబ్రవరి 1
వన్డే సిరీస్‌తో మొదలు- టీ20 సిరీస్‌తో ముగింపు
వన్డే సిరీస్‌
1. జనవరి 18- హైదరాబాద్‌
2. జనవరి 21- రాయ్‌పూర్‌
3. జనవరి 24- ఇండోర్‌

టీ20 సిరీస్‌
1. జనవరి 27- రాంచి
2. జనవరి 29- లక్నో
3. ఫిబ్రవరి 1- అహ్మదాబాద్‌

ఆస్ట్రేలియా భారత పర్యటన: ఫిబ్రవరి 13- మార్చి 22
టెస్టు సిరీస్‌తో ప్రారంభం- వన్డే సిరీస్‌తో ముగింపు
నాలుగు టెస్టులు
1. ఫిబ్రవరి 9- 14: నాగ్‌పూర్‌
2. ఫిబ్రవరి 17- 21: ఢిల్లీ
3. మార్చి 1-5: ధర్మశాల
4. మార్చి 9- 13: అహ్మదాబాద్‌

3 వన్డేలు
1. మార్చి 17- ముంబై
2. మార్చి 19- వైజాగ్‌
3. మార్చి 22- చెన్నై

చదవండి: IND vs BAN: వరుసగా రెండు సెంచరీలు.. రోహిత్‌ స్థానంలో జట్టులోకి! ఎవరీ ఈశ్వరన్?
Ind VS Ban 2nd ODI: కోహ్లికి బదులు సుందర్‌ను పంపాల్సింది.. అప్పుడు: టీమిండియా మాజీ ఓపెనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement