
చెన్నై: వరుస టెస్ట్ సిరీస్‌ల్లో (ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్) టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన భారత స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. కాస్త విరామం దొరకడంతో కుటుంబంతో కలిసి విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నాడు. మంగళవారం కేరళలోని వన్యప్రాణుల అభయారణ్యాన్ని భార్య ఇద్దరు కూతుళ్లతో కలిసి సందర్శించిన ఆయన.. తన కుమార్తెతో కలిసి దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఈ పోస్ట్‌లో అతను ప్రకృతి అందం, దాని ప్రాముఖ్యత గురించి ప్రతి తల్లిదండ్రి పిల్లలకు నేర్పాలని కోరాడు. తల్లిదండ్రులుగా మనం పిల్లలకివ్వగలిగే అత్యుత్తమ బహుమానం ఇదేనంటూ పేర్కొన్నాడు. మరోవైపు అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ కూడా తన ఇద్దరు కూతుళ్లతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. 'మాస్క్ అప్, దట్స్ ఆల్' అంటూ క్యాప్షన్ జోడించింది.