టీమిండియా స్పీడస్టర్ జస్‌ప్రీత్ బుమ్రా వన్డే క్రికెట్‌లో భారత్ తరపున అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే మ్యాచ్‌లో తొలి 10 ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. జేసన్ రాయ్(0), బెయిర స్టో(7), జో రూట్(0), లివింగ్‌స్టోన్(0) రూపంలో బుమ్రా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఇంతకముందు 2013లో శ్రీలంకపై భువనేశ్వర్ కుమార్, 2003లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా శ్రీలంకపై జగవల్ శ్రీనాథ్ తొలి పది ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టారు.
ఇక టీమిండియాతో ఒక వన్డే మ్యాచ్‌లో అత్యంత తక్కువ స్కోరుకే ఐదు వికెట్లు కోల్పోయిన నాలుగో జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఓవల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ 26 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అంతకముందు 1997లో పాకిస్తాన్ 29 పరుగులకే ఐదు వికెట్లు, 2005లో జింబాబ్వే 30 పరుగులకే ఐదు వికెట్లు, 1997లో వెస్టిండీస్ 32 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.
చదవండి: IND vs ENG 1st ODI: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ తొలి వన్డే లైవ్ అప్‌డేట్స్
Comments
Please login to add a commentAdd a comment