డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత టీమిండియా తొలి టెస్టు సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్, టీమిండియా మధ్య ఇవాళ్టి(జూలై 12) నుంచి విండ్సర్ పార్క్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. పేలవ ఫామ్‌తో టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా టీమిండియాలో చోటు కోల్పోయాడు. దేశవాలీ క్రికెట్ సహా ఐపీఎల్‌లో ఆకట్టుకున్న యశస్వి జైశ్వాల్ అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది.అయితే అతను ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్‌గా వస్తాడని కొంతమంది అంటే.. లేదు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడన్నారు. ఇదే విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
''బ్యాటింగ్ పొజిషన్‌లో శుబ్‌మన్ గిల్ మూడో నెంబర్‌లో రానున్నాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడిన గిల్.. తన కెరీర్‌లో ఎక్కువగా మూడు, నాలుగు స్థానాల్లోనే బ్యాటింగ్‌కు వచ్చానని.. అందుకే విండీస్‌తో టెస్టు సిరీస్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని పేర్కొన్నాడు. ఒక రకంగా ఇది మాకు మంచిదే. ఇక నాతో కలిసి యశస్వి జైశ్వాల్ ఓపెనింగ్ చేస్తాడు. నిజానికి ఓపెనింగ్‌లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ బాగుంటుందని నా అభిప్రాయం. ఇదే బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కువ కాలం కొనసాగాలని కోరుకుంటున్నా'' అంటూ తెలిపాడు.
వెస్టిండీస్ గడ్డపై విండీస్‌తో భారత్ 51 టెస్టులు ఆడింది. 9 టెస్టుల్లో నెగ్గి, 16 టెస్టుల్లో ఓడింది. 26 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. ఓవరాల్‌గా రెండు జట్ల మధ్య 98 టెస్టులు జరిగాయి. భారత్ 22 టెస్టుల్లో నెగ్గి, 30 టెస్టుల్లో ఓడింది. 46 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి.
చదవండి: Asia Cup 2023: జై షాను కలిసిన పీసీబీ చైర్మన్.. ఆసియా కప్‌కు గ్రీన్ సిగ్నల్
Comments
Please login to add a commentAdd a comment