రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో రికార్డుపై కన్నేశాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (అక్టోబర్ 19) జరిగే మ్యాచ్‌లో కింగ్ మరో 77 పరుగులు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 26000 పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ఇటీవలే అత్యంత వేగంగా 25000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన కోహ్లి.. ఇవాల్టి మ్యాచ్‌లో సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్దమయ్యాడు.
ఇదిలా ఉంటే, టీమిండియా ఇవాళ పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనున్న విషయం తెలిసిందే. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో జయభేరి మోగించిన భారత్.. మరో గెలుపుపై కన్నేసింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లపై ఘన విజయాలు సాధించిన భారత్.. అదే జోరును బంగ్లాదేశ్‌పై కూడా కొనసాగించాలని భావిస్తుంది. ప్రస్తుతం భారత్ జట్టులోని ప్రతి ఆటగాడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ను నిలువరించడం ఎంతటి జట్టుకైనా కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్.. భారత్‌ను ఏమేరకు నిలువరిస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment