లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆసక్తికర మ్యాచ్‌లో టీమిండియా అష్టకష్టాలు పడి 200 పరుగుల స్కోర్‌ను దాటగలిగింది. బౌలర్లకు స్వర్గధామంగా కనిపిస్తున్న పిచ్‌పై టీమిండియా సారధి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. కష్టతరమైన పిచ్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడటంతో భారత అభిమానులు హిట్‌మ్యాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఓ పక్క వికెట్లు పడుతున్నా హిట్‌మ్యాన్ ఒత్తిడికి గురి కాకుండా ఓపికగా బ్యాటింగ్ చేసిన వైనాన్ని కొనియాడుతున్నారు. హ్యాట్సాఫ్ రోహిత్ భాయ్ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. హిట్‌మ్యాన్ ఇంత సహనంగా బ్యాటింగ్ చేయడాన్ని ఎప్పుడూ చూడలేదని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రోహిత్ వ్యతిరేకులు సైతం ఈ ఇన్నింగ్స్‌ను చూసి శభాష్ అంటున్నారు.
కాగా, బౌలర్ ఫ్రెండ్లీ పిచ్‌పై హిట్‌మ్యాన్ 101 బంతులు ఆడి 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. హిట్‌మ్యాన్‌తో కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 39; 3 ఫోర్లు) కాసేపు బాధ్యతాయుతంగా ఆడటంతో టీమిండియాకు తొలుత బ్రేక్ దొరికింది. రోహిత్, రాహుల్ ఔటయ్యాక సూర్యకుమార్ యాదవ్ (47 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) కూడా ఎంతో సంయనంతో బ్యాటింగ్ చేసి, టీమిండియాను 200 పరుగుల మార్కును దాటించాడు. ఆఖర్లో బుమ్రా (16), కుల్దీప్ (9 నాటౌట్) అడపాదడపా షాట్లు ఆడటంతో టీమిండియా నిర్ణీత ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.
భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (9), విరాట్ కోహ్లి (0), శ్రేయస్ అయ్యర్ (4), జడేజా (8), షమీ (1) తక్కువ స్కోర్లకే ఔటై దారుణంగా నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే 3, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ తలో 2, మార్క వుడ్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment