టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత జట్టు విజయ పథంలో దూసుకుపోతుంది. స్వదేశంలో వరుసగా మూడో సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. గత ఏడాది రోహిత్ సారథ్యంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లను సొంతం చేసుకుంది. హిట్‌మ్యాన్ లీడర్‌షిప్‌లో భారత జట్టు మరింత మెరుగుగా రాణిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీపై టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రోహిత్ తన అద్భుతమైన వ్యూహాలతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడని కార్తీక్ కొనియాడాడు. అయితే రాబోయే రోజుల్లో కెప్టెన్‌గా రోహిత్ కఠినమైన సవాళ్లను ఎదుర్కొవడానికి సిద్దంగా ఉండాలి అని అతడు తెలిపాడు. "రోహిత్ చాలా తెలివైనవాడని నేను భావిస్తున్నాను. అతడు మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణించగలడు.
అతడు ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాబట్టి ఏడాది మొత్తం చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది. ఇదే రోహిత్ లాంటి వారికి పెద్ద సవాల్. రోహిత్ అత్యత్తుమ కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు ఫీల్డ్‌లో తన వ్యూహాలతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. విండీస్‌తో జరిగిన మూడో టీ20లో రోహిత్ ఏం చేశాడో మనం చూసాం. బౌలర్లను రోటేట్ చేస్తూ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అయితే రోహిత్‌కు ఇప్పటికే 34 ఏళ్లు పూర్తి అయ్యాయి. రోహిత్ ఇంకా ఎంత కాలం క్రికెట్ ఆడబోతున్నడన్నదే ప్రశ్నగా మిగిలింది" అని కార్తీక్ పేర్కొన్నాడు. ఇక శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌కు భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. ఇకపై రోహిత్ టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
చదవండి: NZ W vs IND W: స్మృతి మంధాన కళ్లు చెదిరే క్యాచ్.. సూపర్ రీ ఎంట్రీ కదా!
Comments
Please login to add a commentAdd a comment