India vs England, 2nd Test At Vizag Day 3 Updates:
మూడో రోజు ముగిసిన ఆట.. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ దూకుడు
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆట ముగిసింది. భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటై, ఇంగ్లండ్ ముందు 399 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. బెన్ డకెట్ (28) ఔట్ కాగా.. జాక్ క్రాలే (29), రెహాన్ అహ్మద్ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 332 పరుగులు చేయాల్సి ఉంది. వికెట్ పడినా ఇంగ్లండ్ దూకుడుగా ఆడతుంది.
టార్గెట్ 399.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
టీమిండియా నిర్ధేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 50 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి బెన్ డకెట్ (28) ఔటయ్యాడు. జాక్ క్రాలే (21), రెహాన్ అహ్మద్ క్రీజ్‌లో ఉన్నారు. లక్ష్యం పెద్దదైనా ఇంగ్లండ్ ఆటగాళ్లు వేగంగా ఆడుతున్నారు.
255 పరుగులకు ఆలౌట్.. ఇంగ్లండ్ టార్గెట్ 399
భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి అశ్విన్ (29) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని భారత్ 399 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌కు నిర్ధేశించింది.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్
255 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి బుమ్రా (0) ఔటయ్యాడు. ప్రస్తుతం భారత ఆధిక్యం 398 పరుగులుగా ఉంది.
ఎనిమిదో వికెట్ డౌన్
229 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ (0) ఔటయ్యాడు.
ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. మరోసారి విఫలమైన కేఎస్ భరత్
228 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి కేఎస్ భరత్ (6) ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 371 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఆరో వికెట్ కోల్పోయిన భారత్.. అక్షర్ ఔట్
220 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (45) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.
శుబ్‌మన్ గిల్ అద్బుత సెంచరీ
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శుబ్‌మన్ గిల్ అద్బుత సెంచరీతో మెరిశాడు. 132 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో గిల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గిల్‌కు ఇది మూడో టెస్టు సెంచరీ. గిల్ 101 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
గిల్‌తో పాటు అక్షర్ పటేల్(33) క్రీజులో ఉన్నాడు. 52 ఓవర్లకు టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్ స్కోర్: 202/4. టీమిండియా ప్రస్తుతం 345 పరుగుల ఆధిక్యంలో ఉంది.
సెంచరీ దిశగా శుబ్‌మన్ గిల్..
శుబ్‌మన్ గిల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. 89 పరుగులతో గిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 47 ఓవర్లకు టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్ స్కోర్: 183/4
38 ఓవర్లకు భారత్ స్కోర్: 145/4
38 ఓవర్లు పూర్తియ్యే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(68), అక్షర్ పటేల్(9) పరుగులతో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 288 పరుగుల ఆధిక్యంలో ఉంది.
లంచ్ బ్రేక్‌కు భారత్ స్కోర్: 130/4
మూడో రోజు ఆట లంచ్ బ్రేక్ సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(60), అక్షర్ పటేల్(2) పరుగులతో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 273 పరుగుల ఆధిక్యంలో ఉంది.
పాటిదార్ ఔట్..
రజత్ పాటిదార్ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన పాటిదార్.. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 32 ఓవర్లకు భారత్ స్కోర్: 126/4
మూడో వికెట్ డౌన్
112 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి రజత్ పాటిదార్ వచ్చాడు.
శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ..
వైజాగ్ టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాడు శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు. గిల్ 52 బంతులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
నిలకడగా ఆడుతున్న అయ్యర్, గిల్..
శ్రేయస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ నిలకడగా ఆడుతున్నారు. 20 ఓవర్లు ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా రెండు వికెట్లు నష్టానికి 75 పరుగులు చేసింది.
టీమిండియా రెండో వికెట్ డౌన్..
సెకెండ్ ఇన్నింగ్స్‌లో 30 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన జైశ్వాల్.. అండర్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్(9), గిల్(11) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన భారత్..
మూడో రోజు ఆరంభంలోనే టీమిండియాకు బిగ్ షాక్ తగలింది. 13 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. అండర్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి శుబ్‌మన్ గిల్ వచ్చాడు.
ప్రారంభమైన మూడో రోజు ఆట..
విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ఇంగ్లండ్ బౌలింగ్ ఎటాక్‌ను స్పిన్నర్ జో రూట్ ప్రారంభించాడు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(15), రోహిత్ శర్మ(13) పరుగులతో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 171 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment