![England team has won the four ODI series - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/17/eng.jpg.webp?itok=uXE4ynqo)
లండన్: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు 3–1తో సొంతం చేసుకుంది. లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన చివరిదైన నాలుగో వన్డేలో జోస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 311 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలాన్ (114 బంతుల్లో 127; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో రచిన్ రవీంద్ర (4/60), డరైల్ మిచెల్ (2/40) రాణించారు. అనంతరం 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 38.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. రచిన్ రవీంద్ర (48 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ 50 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment