PC: IPL.com
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి తీవ్ర నిరాశపరిచింది. వాజ్‌పేయ్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 121 పరుగులు మాత్రమే చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో అన్మోల్‌ప్రీత్ సింగ్(31), త్రిపాఠి(35), సమద్(21)పరుగులతో రాణించారు. అనంతరం 122 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. 5 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది.
అభిషేక్ శర్మ ఎక్కడ?
ఇక లక్నోతో మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మను ఎస్‌ఆర్‌హెచ్ దూరం పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అతడి స్థానంలో అన్మోల్‌ప్రీత్ సింగ్‌కు సన్‌రైజర్స్ మెనెజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది. కాగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ డకౌట్‌గా వెనుదిరగిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క కారణంతో అతడిని జట్టు నుంచి తప్పించడం సరికాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే దేశవాళీ క్రికెట్‌లో అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అంతేకాకుండా ఎన్నో మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్‌కు అద్భుతమైన ఆరంభాన్ని కూడా ఇచ్చాడు. అదే విధంగా గతేడాది సీజన్‌లో 426 పరుగులు చేసిన అభిషేక్ శర్మ..ఎస్‌ఆర్‌హెచ్ తరపున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
అటువంటి విధ్వంసకర ఆటగాడిని పక్కన పెట్టి సన్‌రైజర్స్ తప్పు చేసిందని, ఇటువంటి ప్రయోగాలు చేసే ఓటములు కొని తెచ్చుకుంటుందని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అన్మోల్ బాగానే ఆడాడు కాబట్టి సరిపోయిందని.. లేదంటే కనీసం ఈ మాత్రం స్కోరు వచ్చేది కాదంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఎస్‌ఆర్‌హెచ్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 9న ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
చదవండి: IPL 2023: అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అద్భుతం! పిచ్ కూడా! ఆ మాట చెప్పడానికి సిగ్గు లేదు
Comments
Please login to add a commentAdd a comment