జింబాబ్వే మాజీ క్రికెట‌ర్ అకాల మ‌ర‌ణం | Zimbabwe First Female World Cup Final Umpire Sarah Dambanevana Dies At 36 | Sakshi
Sakshi News home page

జింబాబ్వే మాజీ క్రికెట‌ర్ అకాల మ‌ర‌ణం

Oct 13 2026 12:31 PM | Updated on Oct 13 2026 12:37 PM

Former Zimbabwe Cricketer-Umpire Sarah Dambanevana-Age-36-Demise

Photo Credit: Twitter

జింబాబ్వే మాజీ ఫాస్ట్ బౌలర్, ప్ర‌స్తుతం అంపైర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న సారా దంబ‌నేవాన 36 ఏళ్ల వ‌య‌సులో అకాల మ‌ర‌ణం చెందారు. క్రికెట‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన‌ప్ప‌టికీ, అంపైరింగ్‌లో తనకంటూ పేరును సంపాదించుకున్న సారా.. మ‌హిళ‌ల‌ ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్లలో విధులను నిర్వర్తించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ‌పడుతున్న సారా దంబ‌నేవాన ఇటీవ‌లే హరారేలోని ప్ర‌ముఖ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 

అయితే సోమ‌వారం రాత్రి చికిత్స తీసుకుంటూనే క‌న్నుమూసిన‌ట్లు జింబాబ్వే క్రికెట్ అసోసియేష‌న్ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అయితే, ఆమె మరణానికి గల కారణాలపై వివరాలు వెల్లడించలేదు. ఎన్‌పీఎల్ టీ20 బ్లాస్ట్ మ్యాచ్‌ల ప్రారంభానికి ముందు సారా దంబనేవన అకాల మ‌ర‌ణం ప‌ట్ల‌ ఒక నిమిషం పాటు మౌనం పాటించారు.

సారా అంతర్జాతీయ అంపైరింగ్ కెరీర్ సెప్టెంబర్ 2, 2023న ప్రారంభమైంది. ఆ తర్వాత ఆమె యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన 2024 మహిళల టీ20 ప్రపంచ కప్‌, భార‌త్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్య‌మిచ్చిన‌ 2025 మహిళల వన్డే ప్రపంచ కప్‌లోనూ అంపైర్‌గా వ్యవహరించారు. 

గతంలో, దక్షిణాఫ్రికాలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన 2023 అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో సారా అంపైర్‌గా వ్యవహరించారు. దీంతో ప్రపంచ కప్ ఫైనల్‌లో అంపైర్‌గా వ్యవహరించిన జింబాబ్వేకు చెందిన తొలి మహిళగా ఆమె నిలిచారు. జింబాబ్వే నుంచి ఈ ఘనత సాధించిన  ఏకైక మ‌హిళా క్రికెట‌ర్‌గా నిలిచారు.

ఐదేళ్ల పాటు క్రికెటర్‌గా..
ఇక సారా దంబ‌నేవానా అంపైర్‌గా స్థిర‌ప‌డ‌క ముందు 2009 నుంచి 2014 వ‌ర‌కు జింబాబ్వే జాతీయ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించారు. ఫాస్ట్ బౌల‌ర్‌గా జ‌ట్టుకు సేవ‌లందించారు. అంపైర్‌గా సారా తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 63 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించారు. వీటిలో 42 మహిళల టీ20ఐలు, 11 మహిళల వన్డేలు, 10 పురుషుల టీ20ఐలు ఉన్నాయి. ఆమె దేశీయ క్రికెట్, వివిధ అంతర్జాతీయ యూత్ టోర్నమెంట్‌లలో కూడా అంపైరింగ్ చేశారు. 2022లో, ఆమెకు ఐసీసీ అంపైర్ డెవలప్‌మెంట్ ప్యానెల్‌లో చోటు ల‌భించింది.

ఇదీ చ‌ద‌వండి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement