
టీమిండియా వెటరన్ ఆటగాడు గురుకీరత్ సింగ్ మాన్ అన్ని రకాల ఫార్మాట్‌ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. శుక్రవారం సోషల్ మీడియా వేదికగా గురుకీరత్ సింగ్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భారత జట్టు తరుపున డెబ్యూ చేసిన ఫోటోలను షేర్ చేశాడు. "ఈ రోజుతో నా అద్భుతమైన క్రికెట్ ప్రయాణం ముగిసింది. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.
నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన బీసీసీఐ, పీసీఏ, నా తోటి ఆటగాళ్లకు, అభిమానులకు ధన్యవాదాలు" అంటూ గురుకీరత్ పేర్కొన్నాడు. గురుకీరత్ సింగ్ 2016లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేల్లో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. గుర్‌కీరత్ తన అంతర్జాతీయ కెరీర్‌లో కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడాడు. తన కెరీర్లో మూడు వన్డేలు ఆడిన అతడు కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు.
అయితే తన అరంగేట్ర సిరీస్‌లో నిరాశపరిచిన గురుకీరత్‌కు మళ్లీ భారత జట్టు తరపున ఆడే అవకాశం రాలేదు. కాగా దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. అదే విధంగా ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ వంటి జట్లు తరపున గురుకీరత్ సింగ్ ఆడాడు.
చదవండి: AUS vs IND: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా విధ్వంసకర ఆటగాడు!
Comments
Please login to add a commentAdd a comment