మూడేళ్ల విరామం తర్వాత టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్.. తన పునరాగమనంపై ఆసక్తికర ట్వీట్ చేశాడు. మనపై మనకు విశ్వాసం ఉన్నప్పుడే ప్రతిదీ మనమనుకున్నట్లుగా జరుగుతుంది.. కష్టకాలంలో మద్ధతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు, నాపై నమ్మకముంచి మరో అవకాశం ఇచ్చిన సెలెక్టర్లకు కృతజ్ఞతలు.. హార్డ్ వర్క్ కంటిన్యూ చేస్తానంటూ డీకే తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
If you believe yourself, everything will fall into place! ✨
— DK (@DineshKarthik) May 22, 2022
Thank you for all the support and belief...the hard work continues... pic.twitter.com/YlnaH9YHW1
కాగా, ప్రస్తుత ఐపీఎల్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్న కార్తీక్.. త్వరలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న డీకే బెస్ట్ ఫినిషర్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 57.40 సగటున 287 పరుగులు చేసిన కార్తీక్.. పలు మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు.
డీకే చివరగా 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆడాడు. ఆ తర్వాత ఫామ్ లేమి కారణంగా అతను జట్టులో చోటు కోల్పోయాడు. 36 ఏళ్ల కార్తీక్ లేటు వయసులో టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వడంపై అతని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభకు వయసుతో సంబంధం లేదని డీకే నిరూపించాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. ఉమ్రాన్, అర్ష్‌దీప్‌లకు తొలి అవకాశం
Comments
Please login to add a commentAdd a comment